గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 22:06:25

స‌రైన అభ్య‌ర్థి లేకే

స‌రైన అభ్య‌ర్థి లేకే

న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) చైర్మ‌న్ ఎన్నిక విష‌యంలో స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. సోమ‌వారం స‌భ్య‌దేశాల‌తో ఆన్‌లైన్‌లో జ‌రిగిన స‌మావేశంలోనూ ఈ అంశం కొలిక్కి రాలేదు. భార‌త్‌కు చెందిన శ‌శాంక్ మ‌నోహ‌ర్ ప‌దివీ కాలం పూర్త‌వ‌డంతో ఎన్నిక అనివార్యం కాగా.. ఈ విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు రెండు సార్లు భేటీ అయిన బోర్డు.. ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోయింది. 

అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన వ్య‌క్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అంద‌రికీ మంచిద‌ని భావిస్తున్న త‌రుణంలో అలాంటి వ్య‌క్తి ఐసీసీకి తార‌స ప‌డ‌లేదు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు చెందిన కొలిన్ గ్రేవ్స్ ఎన్నిక లాంఛ‌న‌మే అని అంతా భావించినా.. తీరా స‌మావేశంలో మాత్రం అత‌డి ఎన్నిక‌ను ఎక్కువ మంది ఆమోదించ‌లేదు. ఐసీసీలో శాశ్వ‌త స‌భ్య‌దేశాలు 12తో క‌లిపి మొత్తం 17 ఓట్లు ఉన్నాయి. దీంట్లో 2/3 మెజారిటీ వ‌చ్చిన వాళ్లు చైర్మ‌న్‌గా ఎన్నిక‌వుతారు. అయితే ఎల‌క్ష‌న్ ప్ర‌క్రియ నిర్వ‌హించ‌కుండా.. అంద‌రికీ ఆమోదయోగ్య‌మైన వ్య‌క్తిని ఆ పీఠంపై కూర్చోబెట్టాల‌ని ఐసీసీ ఎంత ప్ర‌య‌త్నించినా ఈ విష‌యంపై స్ప‌ష్టత రాలేదు. రాబోయే స‌మావేశాల్లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేస్తారా చూడాలి. logo