బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 05, 2020 , 01:45:11

మంజ్రేకర్‌కు దక్కని చోటు

మంజ్రేకర్‌కు దక్కని చోటు

న్యూఢిల్లీ: యూఏఈలో జరుగనున్న ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం ఏడుగురు భారత కామెంటేటర్లను బీసీసీఐ ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ జాబితాలో సంజయ్‌ మంజ్రేకర్‌కు చోటు దక్కలేదు. సునీల్‌ గవాస్కర్‌, ఎల్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌, మురళీ కార్తీక్‌, దీప్‌ దాస్‌గుప్తా, రోహన్‌ గవాస్కర్‌, హర్షాభోగ్లే, అంజుమ్‌ చోప్రాలను బీసీసీఐ సెలెక్ట్‌ చేసింది.  పదో తేదీన వీరు యూఏఈకి బయలుదేరే అవకాశం ఉంది. కాగా గతేడాది వన్డే ప్రపంచకప్‌ సమయంలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను విమర్శించిన కారణంగా మంజ్రేకర్‌పై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే బోర్డు కామెంటేటర్ల ప్యానల్‌ నుంచి సైతం తప్పించిన సంగతి తెలిసిందే. 


logo