శుక్రవారం 15 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 21:57:15

తైక్వాండో క్రీడాకారిణి శ్రీనిఖకు ఎమ్మెల్సీ కవిత అభినందన

తైక్వాండో క్రీడాకారిణి శ్రీనిఖకు ఎమ్మెల్సీ కవిత అభినందన

ఆర్మూర్‌: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం తొండాకూర్‌కు చెందిన మద్దుల శ్రీనిఖను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అభినందించారు. గతేడాది సెప్టెంబర్‌ 25 నుంచి 27 వరకు నిర్వహించిన సీఎం కప్‌ ఆన్‌లైన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో (అండర్‌-11) శ్రీనిఖ పాల్గొని అద్భుత ప్రతిభను ప్రదర్శన చేసింది.  

శ్రీనిఖను సోమవారం హైదరాబాద్‌లో కవితతో పాటు జీవన్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరింతగా రాణించి రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జాతీయ విలువిద్య క్రీడాకారుడు మద్దుల మురళి, తైక్వాండో కోచ్‌ హీరాలాల్‌ తదితరులు పాల్గొన్నారు.