శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 12, 2020 , 00:20:42

భారత్‌కు తొమ్మిది బెర్తులు

భారత్‌కు తొమ్మిది బెర్తులు

అమన్‌(జోర్డాన్‌): ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత, భారత బాక్సర్‌ మనీశ్‌ కౌశిక్‌(63కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ క్వార్టర్స్‌లో ఓడినా బాక్సాఫ్‌లో సత్తాచాటి... విశ్వక్రీడలకు క్వాలిఫై అయిన భారత తొమ్మిదో బాక్సర్‌గా నిలిచాడు. బుధవారం జరిగిన టోర్నీ బాక్సాఫ్‌ పోటీలో కౌశిక్‌ 4-1తేడాతో  హారిసన్‌ గరాసైడ్‌(ఆస్ట్రేలియా)ను చిత్తుచేశాడు. కంటి గాయం కారణంగా పురుషుల విభాగం తుదిపోరు నుంచి తప్పుకున్న వికాస్‌ కృష్ణన్‌(69కేజీలు) రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగం ఫైన ల్లో భారత బాక్సర్‌ సిమ్రన్‌ జీత్‌ కౌర్‌(60కేజీలు) 0-5తేడాతో యివోన్జీ ఓహ్‌(దక్షిణకొరియా)చేతిలో పరాజయం పాలై, రజతం దక్కించుకుంది. 

రికార్డు ఇదే: ఒలింపిక్స్‌కు భారత్‌ తరఫున 9మంది బాక్సర్లు అర్హత సాధించడం ఇదే తొలిసారి. లండన్‌(2012)కు 8మంది క్వాలిఫై కా వడమే ఇప్పటి వరకు అత్యుత్తమం. 


logo