శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Jan 22, 2020 , 23:09:37

క్వార్టర్స్‌లో నిఖత్‌ జరీన్‌

క్వార్టర్స్‌లో నిఖత్‌ జరీన్‌

న్యూఢిల్లీ: సోఫియా(బల్గేరియా) వేదికగా జరుగుతున్న  స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీ లో తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ క్వార్టర్స్‌లోకి దూ సుకెళ్లింది. రెండో రౌండ్‌లో లోకల్‌ ఫేవరెట్‌ స్వెదా అసెనో వా పోటీ నుంచి తప్పుకోవడం తో డిఫెండింగ్‌ చాంపియన్‌ నిఖ త్‌ జరీన్‌ను విజేతగా ప్రకటించారు. మరోవైపు పురుషుల 63కిలోల విభాగంలో శివ తాపా 5-0 తేడాతో పావెల్‌ పోలాకోవిచ్‌(పోలండ్‌)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. 69కిలోల బౌట్‌లో దుర్యోధన్‌సింగ్‌ నేగి 5-0తో కీరన్‌ మలాయ్‌(ఐర్లాండ్‌)పై గెలిచి క్వార్టర్స్‌లో నిలిచాడు. మరోవైపు అంకిత్‌(75కి), దీపక్‌ కుమార్‌(52కి), నరేందర్‌(91+ కి), నవీన్‌ కుమార్‌(91కి), నుపూ ర్‌(75కి), లలిత(69కి) తొలి రౌండ్లలోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. 


logo