బెల్గ్రేడ్: భారత గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ సెర్బియా ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. ఇటీవల సిల్వర్ లేక్ ఓపెన్ నెగ్గిన పదహారేండ్ల నిహాల్‌కు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. నిహాల్ గురువారం రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాదిమిర్ ఫెడోసీవ్తో జరిగిన చివరి రౌండ్‌ను ‘డ్రా’ చేసుకోవడం ద్వారా 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు.