మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 22, 2020 , 01:09:11

సెమీస్‌లో నిహాల్‌, గుకేశ్‌

సెమీస్‌లో నిహాల్‌, గుకేశ్‌

చెన్నై: ఫిడే ఆన్‌లైన్‌ వరల్డ్‌ క్యాడెట్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో నిహాల్‌ సరీన్‌, గుకేశ్‌ సహా నలుగురు భారత ఆటగాళ్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగిన అండర్‌-18 క్వార్టర్‌ ఫైనల్లో సరీన్‌ 1.5-0.5తో జస్టిన్‌ వాంగ్‌ (అమెరికా)పై విజయం సాధించగా.. అండర్‌-14 విభాగంలో ప్రణవ్‌ను చిత్తుచేసి గుకేశ్‌ సెమీస్‌లో అడుగుపెట్టాడు. వీరితో పాటు రక్షిత రవి (బాలికల అండర్‌-16), మృణ్మయ్‌ రాజ్‌ఖోవా (అండర్‌-10, ఓపెన్‌) కూడా సెమీస్‌ చేరారు. రక్షిత 2-1తో హెర్నాండెజ్‌ గిల్‌పై నెగ్గగా.. మృణ్మయ్‌ 2-0తో రియో చెన్‌ (అమెరికా)ను చిత్తు చేశాడు.


logo