మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 28, 2020 , 00:27:20

సమయాల్లో మార్పుల్లేవ్‌

 సమయాల్లో మార్పుల్లేవ్‌
  • ఐపీఎల్‌ రాత్రి మ్యాచ్‌లు 8గంటలకే

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఈ ఏడాది సీజన్‌లో కూడా రాత్రివేళ జరిగే మ్యాచ్‌లు 8గంటలకే ప్రారంభం కానున్నాయి. మే 24న ముంబై వేదికగా ఫైనల్‌ జరుగనుంది. మార్చి 29న ప్రారంభమయ్యే 13వ సీజన్‌ మ్యాచ్‌ల నిర్వహణపై సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఐపీఎల్‌  పాలకవర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది కాంకషన్‌ సబ్‌స్టిట్యూషన్‌తో పాటు నోబాల్‌ నిర్ణయాన్ని థర్డ్‌ అంపైరే ప్రకటించే కొత్త నిబంధనను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. తుదిపోరు వాంఖడే మైదానంలో మే 24న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. సమావేశం అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌  గంగూలీ వివరాలను  వెల్లడించాడు. ‘ఐపీఎల్‌  రాత్రి మ్యాచ్‌ ల సమయాల్లో మార్పులేదు. ఇంతకు ముందులాగే 8గంటలకే ప్రారంభమవుతాయి. ఈ సీజన్‌లో ఐదు రోజుల్లో మాత్రమే రెండు మ్యాచ్‌లు ఉంటాయి.  ముంబైలో ఫైనల్‌ జరుగుతుంది. కాంకషన్‌  సబ్‌స్టిట్యూట్‌, నోబాల్‌ విధానం కొత్తగా తీసుకొచ్చాం’ అని సౌరవ్‌  తెలిపాడు. దీంతో లీగ్‌ దశలో ఐదు మ్యాచ్‌లు మాత్రమే సాయంత్రం జరుగనుండగా, మిగిలినవన్నీ రాత్రి 8గంటలకు ప్రారంభం కానున్నాయి. 


logo
>>>>>>