సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 11, 2020 , 13:56:51

నికోల్స్‌ హాఫ్‌ సెంచరీ.. లక్ష్యం దిశగా కివీస్‌

నికోల్స్‌ హాఫ్‌ సెంచరీ.. లక్ష్యం దిశగా కివీస్‌

మౌంట్‌ మాంగనీ: బే ఓవల్‌ మైదానంలో ఇండియాతో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఆతిథ్య కివీస్‌ అదరగొడుతోంది. భారత్‌ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్య సాధనలో కివీస్‌.. వడివడిగా ముందుకు సాగుతోంది. ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌(46 బంతుల్లో 66: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోల్స్‌ అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దూకుడుగా ఆడుతూ, భయంకరంగా మారుతున్న గప్టిల్‌ను చాహల్‌ బొల్తా కొట్టించాడు. దీంతో తొలి వికెట్‌ సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(22) నెమ్మదిగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చాహల్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి, మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తదనంతరం, ఈ సిరీస్‌లో అత్యద్భుతంగా రాణిస్తున్న రాస్‌ టేలర్‌ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం కివీస్‌ 30 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజులో నికోల్స్‌(77 బ్యాటింగ్‌), టేలర్‌(5 బ్యాటింగ్‌) ఉన్నారు. న్యూజిలాండ్‌ విజయానికి 20 ఓవర్లలో 122 పరుగులు కావాలి. కాగా, కివీస్‌ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ముందజలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కూడా గెలిచి సిరీస్‌ను 3-0తో వైట్‌ వాష్‌ చేద్దామని కివీస్‌ భావిస్తుండగా.. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి, ఇండియా 1-2తో ఆధిక్యాన్ని తగ్గించాలని పట్టుదలగా ఉంది.


logo