e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో వేసుకున్న జెర్సీ వేలం వేస్తున్న కివీస్ ప్లేయ‌ర్‌.. ఎందుకో తెలుసా?

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో వేసుకున్న జెర్సీ వేలం వేస్తున్న కివీస్ ప్లేయ‌ర్‌.. ఎందుకో తెలుసా?

వెల్లింగ్ట‌న్‌: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిన్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ పేస్ బౌల‌ర్ టిమ్ సౌథీ.. ఫైన‌ల్లో తాను వేసుకున్న జెర్సీల్లో ఒక‌దానిని వేలం వేస్తున్నాడు. ఆ వ‌చ్చిన డ‌బ్బును అత‌డు క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న 8 ఏళ్ల చిన్నారికి ఇవ్వ‌నున్నాడు. ఫైన‌ల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి టీమ్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు సౌథీ. ఈ చారిత్ర‌క టెస్ట్ మ్యాచ్‌లో తాను వేసుకున్న ష‌ర్ట్‌ను వేలం వేస్తున్నట్లు సౌథీ ఆ వేలం వెబ్‌సైట్‌లో చెప్పాడు. న్యూరోబ్లాస్టోమా అనే అరుదైన క్యాన్స‌ర్‌తో ఆ చిన్నారి బాధ‌ప‌డుతోంది. కొన్నాళ్లుగా హోలీ బీటీ అనే ఆ అమ్మాయికి సౌథీ త‌న‌కు తోచిన సాయం చేస్తూనే ఉన్నాడు.

ఇప్పుడు త‌న టీమ్ స‌భ్యులంద‌రూ సంత‌కాలు చేసిన త‌న జెర్సీని వేలం వేస్తున్నాడు. కొద్దో, గొప్పో ఎంత వీలైతే అంత సాయం చేయాల‌ని సౌథీ కోరుతున్నాడు. ఈ వేలం ద్వారా వ‌చ్చిన డ‌బ్బు మొత్తం ప్ర‌స్తుతం స్పెయిన్‌లో చికిత్స పొందుతున్న బీటీకి వెళ్తాయ‌ని అత‌డు చెప్పాడు. రెండేళ్ల కింద‌ట ఆ చిన్నారి గురించి త‌న‌కు తెలిసింద‌ని, అప్ప‌టి నుంచి త‌న‌కు తోచిన రీతిలో సాయం చేస్తూనే ఉన్నాన‌ని తెలిపాడు. ఈ జెర్సీ వేలం ద్వారా వ‌చ్చిన డ‌బ్బు ఆమెకు ఎంతో కొంత సాయం చేస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కున్న‌ద‌ని అన్నాడు. ఈ వేలానికి జులై 8 వ‌ర‌కూ బిడ్లు దాఖ‌లు చేయ‌వ‌చ్చు. మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌ర‌కూ 152 బిడ్లు దాఖ‌లు కాగా.. అత్య‌ధికంగా 7 వేల డాల‌ర్ల బిడ్ వ‌చ్చింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana