మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 21, 2020 , 01:09:27

కివీస్‌దే సిరీస్‌

కివీస్‌దే సిరీస్‌

హామిల్టన్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్‌.. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను ఓ మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో టీ20లో కివీస్‌ 9 వికెట్ల తేడాతో పాక్‌పై సునాయాసంగా గెలిచింది. ఓపెనర్‌ టిమ్‌ సీఫెర్ట్‌ (63 బంతుల్లో 84 నాటౌట్‌), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (42 బంతుల్లో 57 నాటౌట్‌) రెచ్చిపోవడంతో 164 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ (57 బంతుల్లో 99 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒకే ఒక్కడిగా చెలరేగిపోయాడు. 


logo