గురువారం 21 జనవరి 2021
Sports - Dec 19, 2020 , 00:55:02

కివీస్‌ చేతిలో పాక్‌ చిత్తు

కివీస్‌ చేతిలో పాక్‌ చిత్తు

అక్లాండ్‌: పేసర్‌ జాకబ్‌ డుఫీ (4/33) అరంగేట్ర మ్యాచ్‌లోనే నిప్పులు చెరగడంతో పాకిస్థాన్‌తో పొట్టిపోరులో న్యూజిలాండ్‌  శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య కివీస్‌  చిత్తుచేసింది. డుఫీ విజృంభణతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌  ఓ దశలో 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఆ తరుణంలో స్టాండిన్‌ కెప్టెన్‌ షాబాద్‌ ఖాన్‌ (42) జట్టును ఆదుకున్నాడు. ఫహీమ్‌ అష్రఫ్‌ (31) అతడికి సహకరించడంతో పాక్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేయగలిగింది. కివీస్‌ బౌలర్లలో స్కాట్‌ కుగ్‌లీన్‌కు మూడు వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో ఓపెనర్‌ టిమ్‌ సీఫెర్ట్‌ (57), మార్క్‌ చాంప్‌మన్‌ (34) అదరగొట్టడంతో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్‌  విజయం సాధించింది.  మార్టిన్‌ గప్టిల్‌ (6), కాన్వే (5) విఫలమయ్యారు. పాకిస్థాన్‌  బౌలర్లలో హరీస్‌ రవూఫ్‌ మూడు, షాహిన్‌ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టారు.


logo