మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 06, 2021 , 12:17:56

పాక్‌తో సిరీస్ క్లీన్‌స్వీప్‌.. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కివీస్ టాప్‌

పాక్‌తో సిరీస్ క్లీన్‌స్వీప్‌.. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కివీస్ టాప్‌

క్రైస్ట్‌చ‌ర్చ్‌:  కొత్త ఏడాదిని న్యూజిలాండ్ అద్భుతంగా స్టార్ట్ చేసింది. పాకిస్థాన్‌తో జ‌రిగిన రెండ‌వ టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 176 ర‌న్స్ తేడాతో విజ‌యం సాధించింది. అంతే కాదు.. టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ తొలిసారి టాప్‌లో నిలిచింది. రెండ‌వ ఇన్నింగ్స్‌లో పాక్‌ను కేవ‌లం 186 ర‌న్స్‌కే కివీస్ ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్(238) డ‌బుల్ సెంచ‌రీ చేసిన విష‌యం తెలిసిందే. ‌కివీస్ బౌల‌ర్ కైల్ జేమిస‌న్ ఆరు వికెట్లు తీసుకుని పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చాడు.  తొలి టెస్టులో సెంచ‌రీ, రెండ‌వ టెస్టులో డ‌బుల్ సెంచ‌రీ చేసిన కేన్ విలియ‌మ్స‌న్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ద‌క్కింది. ఈ సిరీస్‌లో విలియ‌మ్స‌న్ 129.33 యావ‌రేజ్‌తో 388 ర‌న్స్ చేశాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో నెగ్గిన కివీస్‌.. తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి స్థానానికి చేరుకున్న‌ది. 118 పాయింట్ల‌తో న్యూజిలాండ్ మొద‌టి ర్యాంక్‌లో నిలిచింది.  

స్కోర్ బోర్డు

పాకిస్థాన్ 297, 186

న్యూజిలాండ్ 659-6 డిక్లేర్డ్‌