ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 26, 2020 , 12:00:16

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

తొలి టీ 20 మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌కి సిద్ధ‌మైంది. మ‌రి కొద్ది సేప‌ట్లో ఆక్లాండ్ వేదిక‌గా జ‌రుగ‌నున్న‌ రెండో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సాధించాల‌ని కోహ్లీ టీం భావిస్తుంటే,  సిరీస్‌ సమం చేయాలని కివీస్‌ కృతనిశ్చయంతో ఉంది. అయితే రెండో టీ 20 మ్యాచ్‌లో ఇటు భార‌త్ అటు కివీస్ టీంలు ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్లాక్ క్యాప్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడుతున్న రాహుల్‌.. అటు బ్యాటింగ్‌లో ఇటు కీపింగ్‌లో సత్తాచాటుతుండటం టీమ్‌ఇండియాకు భారీ ఉపశమనాన్ని ఇస్తుంది. రోహిత్ శ‌ర్మ కూడా రాణిస్తే టీం ఇండియా విజ‌య‌డంఖా మోగించ‌డం ఖాయం. కోహ్లీ, శ్రేయాస్‌, మ‌నీష్ మంచి ఫాంలో ఉన్నారు. ఇక బౌల‌ర్స్ విష‌యానికి వ‌స్తే ష‌మీ, ఠాకూర్, దూబే గాడిలో ప‌డాల్సి ఉంది. 


logo