గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 23, 2020 , 06:32:28

న్యూజిలాండ్ 348 ఆలౌట్‌.. 183 ప‌రుగుల ఆధిక్యం

న్యూజిలాండ్ 348 ఆలౌట్‌.. 183 ప‌రుగుల ఆధిక్యం

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌- భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో కివీస్‌దే పైచేయిగా క‌నిపిస్తుంది.   ఓవర్‌నైట్‌ స్కోర్  216/5తో ఆదివారం తొలి ఇన్నిం గ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్ 348 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. చివ‌ర‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ జెమీసన్‌, బౌల్ట్ బ్యాట్ ఝుళిపించ‌డంతో కివీస్‌కి 183 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఆట మొద‌లైన కొద్ది సేప‌టికే వాట్లింగ్‌(14) ఔట్ కాగా, ఆ త‌ర్వాత జేమిస‌న్‌( 44), గ్రాండ్ హోమ్‌(43)తో క‌లిసి స్కోర్ బోర్డ్ ప‌రుగులెత్తించాడు. ఈ భాగ‌స్వామ్యానికి అశ్విన్ తెరదించ‌గా, చివ‌ర్లో వ‌చ్చిన బౌల్ట్ ( 24 బంతుల్లో 38 ప‌రుగులు) చేసిన ఔట్ అయ్యాడు. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేప‌థ్యంలో టెస్ట్ రిజ‌ల్ట్ త‌ప్ప‌క రానుంది. భార‌త బౌల‌ర్స్ విష‌యానికి వ‌స్తే ఇషాంత్ శ‌ర్మ ఐదు వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, బుమ్రా, ష‌మీ చెరో వికెట్ తీసుకున్నారు. 


logo
>>>>>>