శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 10, 2020 , 18:49:00

భారత్‌తో మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన కివీస్‌

భారత్‌తో మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన కివీస్‌

మౌంట్‌మంగనీ:  వన్డే సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో ఆతిథ్య న్యూజిలాండ్‌ ఆఖరి సమరానికి సిద్ధమైంది. తొలి రెండు వన్డేల్లో అన్ని రంగాల్లో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కివీస్‌.. ఆఖరి వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ సమర్పించుకున్న టీమ్‌ఇండియా గట్టిపోటీనివ్వాలని నిర్ణయించుకుంది. ఫామ్‌కోల్పోయి ఇబ్బందిపడుతున్న యువ స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పుంజుకోవాల్సి ఉంది.  తొలి రెండు వన్డేల్లో అతడు ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేదు. 

ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది. కొత్త ఓపెనర్ల తడబాటు కొనసాగుతున్న నేపథ్యంలో కోహ్లీతో సహా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాలి. బౌలింగ్‌లోనూ పదును లోపించడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. చివరి వన్డే మంగళవారం మౌంట్‌ మాంగనీలో జరగనుంది. logo