బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 00:02:48

బౌల్ట్‌ పునరాగమనం

బౌల్ట్‌ పునరాగమనం

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ ఏస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు. గతేడాది ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టు సందర్భంగా కుడి చేతి గాయంతో జట్టుకు దూరమైన అతడు చాన్నాళ్ల తర్వాత తిరిగొచ్చాడు. శుక్రవారం నుంచి టీమ్‌ఇండియాతో జరుగనున్న తొలి టెస్టు కోసం ఆ దేశ క్రికెట్‌ బోర్డు సోమవారం 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. 


ఇందులో బౌల్ట్‌తో పాటు ఆరడుగుల ఎనిమిదంగులాల యువ పేసర్‌ కైల్‌ జెమీసన్‌ కూడా చోటు దక్కించుకున్నాడు. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా ఎజాజ్‌ పటేల్‌కు స్థానం దక్కింది. ‘బౌల్ట్‌లాంటి అనుభవం కలిగిన పేసర్‌ ఉండటం జట్టులో ఉత్సాహాన్ని నింపుతుంది. వెల్లింగ్టన్‌ పిచ్‌ నుంచి బౌన్స్‌ రాబట్టగలిగే సత్తా జెమీసన్‌లో ఉంది కాబట్టే అతడిని ఎంపిక చేశారు. ఎజాజ్‌ పటేల్‌కు తిరిగి స్వాగతం పలుకుతున్నాం’ అని ఆ జట్టు కోచ్‌ గారీ స్టెడ్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన వికెట్‌ కీపర్‌ టామ్‌ బ్లండెల్‌, ఇంగ్లండ్‌ పర్యటనలో అదరగొట్టిన డారిల్‌ మిషెల్‌ కూడా జట్టులో చోటు నిలబెట్టుకున్నారు. 


న్యూజిలాండ్‌ జట్టు: విలియమ్సన్‌ (కెప్టెన్‌), బ్లండెల్‌, బౌల్ట్‌, గ్రాండ్‌హోమ్‌, జెమీసన్‌, లాథమ్‌, డారిల్‌, నికోల్స్‌, ఎజాజ్‌ పటేల్‌, సౌథీ, టేలర్‌, వాగ్నర్‌, వాట్లింగ్‌.


logo