శనివారం 16 జనవరి 2021
Sports - Dec 07, 2020 , 00:48:02

న్యూజిలాండ్‌ భారీ విజయం

న్యూజిలాండ్‌ భారీ విజయం

ఇన్నింగ్స్‌ 134 పరుగుల తేడాతో విండీస్‌ చిత్తు 

హామిల్టన్‌: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అన్ని విభాగాల్లో అదరగొట్టిన న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్‌ ఇన్నింగ్స్‌ 134 పరుగుల భారీ తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 196/6తో గురువారం నాలుగో రోజు ఫాలోఆన్‌ కొనసాగించిన వెస్టిండీస్‌ 247 పరుగులకు ఆలౌటైంది. 80 పరుగుల వ్యక్తిగత స్కోరుతో క్రీజులో అడుగుపెట్టిన జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (104) శతకంతో ఆకట్టుకోగా.. అల్జారీ జోసెఫ్‌ (86) అతడికి అండగా నిలిచాడు. 89 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరూ 155 పరుగులు జోడించడంతో వెస్టిండీస్‌ కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (251) ద్విశతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయగా.. విండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే ఆలౌటైంది.