సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Jan 26, 2020 , 23:20:54

భారత్‌-‘ఎ’ పరాజయం

భారత్‌-‘ఎ’ పరాజయం

క్రైస్ట్‌చర్చ్‌: మిడిలార్డర్‌ వైఫల్యంతో న్యూజిలాండ్‌ -‘ఎ’తో జరిగిన మూడో అనధికారిక వన్డేలో భారత్‌-‘ఎ’ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. చాప్‌మన్‌ (110 నాటౌట్‌) సెంచరీతో కదంతొక్కగా.. అస్టిల్‌ (56) అర్ధశతకం సాధించాడు. భారత బౌలర్లలో పొరెల్‌కు 3, రాహుల్‌ చాహర్‌కు 2 వికెట్లు దక్కాయి. 


అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు పృథ్వీ షా (38 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (44) రాణించడంతో ఒకదశలో 12.2 ఓవర్లలో 79/0తో పటిష్ట స్థితిలో నిలిచిన భారత్‌-‘ఎ’.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి చివరకు 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్‌ కిషన్‌ (71 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. ఆఖరి ఓవర్‌లో భారత్‌ విజయానికి 7 పరుగులు అవసరమైన దశలో రెండో బంతికి సింగిల్‌ తీసిన ఇషాన్‌ నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌కు పరిమితమవగా.. మరోవైపు వరుస బంతుల్లో సందీప్‌ (0), పొరెల్‌ (0) ఔటవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది.


logo