శుక్రవారం 15 జనవరి 2021
Sports - Dec 27, 2020 , 00:18:13

న్యూజిలాండ్‌ 222/3

న్యూజిలాండ్‌ 222/3

మౌంట్‌ మాంగనీ: కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (94 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) అదరగొట్టడంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. బాక్సింగ్‌ డే టెస్టులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ శనివారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. పాక్‌ యువ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది (3/55) ధాటికి.. ఓపెనర్లు లాథమ్‌ (4), బ్లండెల్‌ (5) పెవిలియన్‌ బాట పట్టడంతో న్యూజిలాండ్‌ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో  టేలర్‌ (70)తో కలిసి విలియమ్సన్‌ మూడో వికెట్‌కు 120 పరుగులు జోడించాడు. తర్వాత నికోల్స్‌ (42).. కెప్టెన్‌కు చక్కటి సహకారం అందించాడు.