ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 24, 2020 , 00:09:33

వరల్డ్‌ గేమ్స్‌కు కొత్త లోగో

వరల్డ్‌ గేమ్స్‌కు కొత్త లోగో

బర్మింగ్‌హామ్‌: 2022కు వాయిదా పడిన బర్మింగ్‌హామ్‌ వరల్డ్‌ గేమ్స్‌కు కొత్త లోగో, టైటిల్‌ను నిర్వాహక కమిటీ గురువారం విడుదల చేసింది. టోర్నీకి వరల్డ్‌ గేమ్స్‌ 2022 బర్మింగ్‌హామ్‌గా పేరు మార్చడంతో పాటు ఆ ఏడాది జూలై 7 నుంచి 17వ తేదీ వరకు ప్రపంచ క్రీడలను నిర్వహిస్తామని ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జూలైలో ప్రపంచ క్రీడలు జరగాల్సింది. అయితే కరోనా వైరస్‌ కారణంగా టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది జూలైకి వాయిదా పడడంతో ప్రపంచ క్రీడలను సంవత్సరం ఆలస్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


logo