సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 22, 2020 , 19:32:35

అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉండడాన్ని ఎప్పుడూ చూడలేదు : హోల్డింగ్‌

అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉండడాన్ని ఎప్పుడూ చూడలేదు : హోల్డింగ్‌

రిటైర్డ్ లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనిపై వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మైఖేల్ హోల్డింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 1970లలో వెస్టిండీస్ పేసర్‌ అయిన హోల్డింగ్‌ మాట్లాడుతూ ధోని ప్రశాంతమైన మాటలు కొన్నిసార్లు మ్యాచ్ గమనాన్ని భారత్‌ వైపునకు మారుస్తాయన్నాడు. ‘అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉండడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. పరిస్థితి చేజారినట్లు అనిపిస్తే ధోని తన ఆటగాళ్లను పిలిచి ప్రశాంతంగా మాట్లాడుతాడు. వెంటనే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఈ నైపుణ్యం కేవలం ధోని ఒక్కడిలోనే చూశాన’ని హోల్డింగ్ తన యూట్యూబ్ చానెల్‌లో అన్నాడు. 

హోల్డింగ్ ధోని ఫిట్‌నెస్‌ను ప్రశంసిస్తూ ‘ఇన్నేండ్లు విజయవంతమైన కెప్టెన్‌గా ఉండడం ప్రశంసనీయం. స్థిరంగా పరుగులు చేయడం కూడా ధోనికే దక్కుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ధోని తనను తాను ఆరోగ్యంగా ఉంచుకుంటూ వన్డేల్లో 11 వేల పరుగులు సాధించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలను దక్కించుకున్న కెప్టెన్‌గా ధోని రికార్డు సృష్టించాడని’ హోల్డింగ్ అన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo