బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 08, 2020 , 22:14:08

లాక్‌డౌన్‌తో మా ప్లాన్ మారదు: బౌచ‌ర్

లాక్‌డౌన్‌తో మా ప్లాన్ మారదు: బౌచ‌ర్

లాక్‌డౌన్‌తో మా ప్లాన్ మారదు: బౌచ‌ర్

జొహాన్నెస్‌బ‌ర్గ్‌: ప‌్ర‌మాద‌క‌ర క‌రోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా మా ప్ర‌ణాళిక‌ల్లో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని ద‌క్షిణాఫ్రికా చీఫ్ కోచ్ మార్క్ బౌచ‌ర్ అన్నాడు. లాక్‌డౌన్‌తో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఎలాంటి గంద‌ర‌గోళం లేద‌ని తెలిపాడు ‘లాక్‌డౌన్‌తో ఏర్ప‌డ్డ ఈ స‌మ‌యాన్ని విరామంగా భావిస్తున్నాం. ఎలాంటి ప్ర‌యాణాలు చేయ‌కుండా..ఆట‌గాళ్లంతా కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి స‌రాదాగా గ‌డిపేందుకు ఇది మంచి అవ‌కాశం. దీనికి తోడు ఈ స‌మ‌యంలో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ రానున్న సిరీస్‌ల కోసం సిద్ధంగా ఉండేందుకు క్రికెట‌ర్లంద‌రికీ షెడ్యూల్ ఇచ్చాం’ అని బౌచ‌ర్ అన్నాడు. ఇటీవ‌ల భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌ను అర్ధాంత‌రంగా ముగించుకున్న స‌ఫారీ జట్టు క‌రోనా కార‌ణంగా తిరిగి స్వ‌దేశానికి బ‌యల్దేరి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. 


logo