దుబాయ్: భారత ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయత్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. గత మూడేండ్లుగా ఓటమి లేకుండా సాగుతున్న నీరజ్.. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన సూపర్ బాక్సింగ్ లీగ్‌లో కాంగోకు చెందిన బెబె రికోను నాకౌట్ చేశాడు. నీరజ్ పదునైన పంచ్‌లకు మూడో రౌండ్లోనే ప్రత్యర్థి చిత్తయ్యాడు. దీంతో నీరజ్ ఖాతాలో మరో విజయం చేరింది.