శుక్రవారం 10 జూలై 2020
Sports - May 30, 2020 , 21:55:04

వరుసగా మూడోసారి

వరుసగా మూడోసారి

న్యూఢిల్లీ: స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా వరుసగా మూడో ఏడాది ఖేల్‌రత్నా పురస్కారానికి నామినేట్‌ అయ్యాడు. ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన నీరజ్‌.. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నుంచి కేవలం నీరజ్‌ పేరును మాత్రమే సిఫారసు చేసినట్లు సమాచారం. స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ను ఒడిశా ప్రభుత్వం అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. 

టోక్యో ఒలింపిక్స్‌ అర్హత దూరం 85 మీటర్లు కాగా.. నీరజ్‌ గాయం నుంచి కోలుకున్న మరుసటి టోర్నీలోనే 87.86 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి టోక్యో ఒలింపిక్స్‌నకు అర్హత సాధించాడు. ఓవరాల్‌గా జకార్తా ఆసియా క్రీడల్లో 88.06 మీటర్ల దూరాన్ని నమోదు చేసిన నీరజ్‌పై భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒలింపిక్స్‌ పతకం నెగ్గే సత్తా అతడిలో ఉందని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య కూడా నమ్మకంగా చెబుతున్నది. అయితే కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో విశ్వక్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడగా.. ప్రత్యేక శిక్షణ కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.  


logo