ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 09, 2020 , 17:15:10

2 ఇన్నింగ్స్‌ల్లో 500 దంచేశాడు..ఆ కుర్రాడితో భారత్‌కు కష్టాలే!

2 ఇన్నింగ్స్‌ల్లో 500 దంచేశాడు..ఆ కుర్రాడితో భారత్‌కు కష్టాలే!

మెల్‌బోర్న్‌ :  ఏ ఫార్మాట్‌లోనైనా వరుసగా రెండు డబుల్‌ సెంచరీలు బాదడం గొప్ప ఘనతే. బౌలర్లను ఎదుర్కొంటూ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం అంత ఆషామాషీ విషయం  కాదు. ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెషీల్డ్‌ ఫీల్డ్‌లో  విక్టోరియా బ్యాట్స్‌మన్‌ విల్‌ పుకోస్కీ(22) సంచలన  బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. సౌత్‌ ఆస్ట్రేలియాపై 255 నాటౌట్‌, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాపై 202 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 

రెండు ఇన్నింగ్స్‌ల్లో సుమారు 500 పరుగులు చేసిన పుకోస్కీని స్వదేశంలో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు  ఎంపిక చేయాలన్న డిమాండ్‌ కూడా పెరుగుతోంది. ఫస్ట్‌క్లాస్‌ డొమెస్టిక్‌ కాంపిటీషన్‌లో విల్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆసీస్‌ క్రికెట్లో అతని పేరు మార్మోగిపోతోంది.  ఒకవేళ అతనికి టెస్టు జట్టులో చోటు దక్కితే విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టుకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. 

పుకోస్కీ డబుల్‌ సెంచరీలు సాధించడంలో  కళ్లుచెదిరే బ్యాటింగ్‌  సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్లో పోస్ట్‌ చేసింది. ఒకవేళ విల్‌కు తుది జట్టులో అవకాశం వస్తే డేవిడ్‌ వార్నర్‌తో అతడు ఓపెనర్‌గా బరిలో దిగనున్నాడు.  భారత్‌తో నాలుగు టెస్టు సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించాల్సి ఉంది.