ఆదివారం 24 జనవరి 2021
Sports - Jan 06, 2021 , 13:12:56

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ఆడ‌బోయే టీమ్ ఇదే

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ఆడ‌బోయే టీమ్ ఇదే

సిడ్నీ: ఆస్ట్రేలియాతో గురువారం నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్‌లో ఆడ‌బోయే తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది టీమిండియా. ఇందులో రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతోంది. గాయ‌ప‌డిన ఉమేష్ యాద‌వ్ స్థానంలో ఈ మ్యాచ్‌తోనే పేస్‌బౌల‌ర్ న‌వ్‌దీప్ సైనీ టెస్ట్ అరంగేట్రం చేయ‌నుండ‌గా.. మ‌యాంక్ అగ‌ర్వాల్ స్థానంలో రోహిత్ శ‌ర్మ టీమ్‌లోకి వ‌చ్చాడు. శుభ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి రోహిత్ ఓపెనింగ్ చేయ‌నున్నాడు. సైనీతో క‌లిపితే ఈ సిరీస్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన భార‌త ఆట‌గాళ్ల సంఖ్య మూడుకి చేరింది. ఇంత‌కుముందు బాక్సింగ్ డే టెస్ట్‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, శుభ్‌మ‌న్ గిల్ కూడా టెస్టుల్లో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రోహిత్ శ‌ర్మ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 

సిడ్నీ టెస్ట్‌లో ఆడే టీమ్‌:  శుభ్‌మ‌న్ గిల్‌, రోహిత్ శ‌ర్మ‌, పుజారా, ర‌హానే, విహారి, రిష‌బ్ పంత్‌, జ‌డేజా, బుమ్రా, సిరాజ్‌, సైనీ, అశ్విన్‌ 


logo