గురువారం 21 జనవరి 2021
Sports - Jan 11, 2021 , 18:36:02

జడ్డూకు అరటి పండు తొక్క తీసి ఇచ్చిన సైనీ: వీడియో

జడ్డూకు అరటి పండు తొక్క తీసి ఇచ్చిన సైనీ: వీడియో

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టును టీమ్‌ఇండియా డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. ఐదో రోజు ఆటలో ఆసీస్‌ బౌలర్లను హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో వికెట్‌ పడకుండా ఆఖరి వరకు క్రీజులో నిలబడి ఓటమి నుంచి జట్టును కాపాడారు. 

ఆఖరి సెషన్‌లో వీరిద్దరిలో ఎవరైనా ఔటైతే  బ్యాటింగ్‌కు వచ్చేందుకు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సిద్ధంగా ఉన్నాడు. ప్యాడ్‌ ధరించిన జడ్డూ  డ్రెస్సింగ్‌ రూమ్‌లో నవదీప్‌ సైనీ పక్కన  కూర్చున్నాడు. ఈ సమయంలో  సైనీ అరటిపండు తొక్క తీసి జడేజాకు ఇస్తుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  మూడో రోజు ఆటలో మిచెల్‌ స్టార్క్‌ వేసిన బంతి జడేజా ఎడమచేతి బొటనవేలికి బలంగా తాకింది. గాయంతోనే బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధమైన జడేజా అరటిపండు తింటూ కెమెరాకి చిక్కాడు. 

తాజావార్తలు


logo