గురువారం 02 జూలై 2020
Sports - Jun 08, 2020 , 22:07:11

నైపుణ్యం + పట్టుదల = కోహ్లీ

నైపుణ్యం + పట్టుదల = కోహ్లీ

భారత కెప్టెన్‌పై కివీస్‌ సారథి ప్రశంసలు

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ప్రశంసలు కురిపించాడు. పరుగులు సాధించాలనే కసికి సహజ సామర్థ్యం తోడవడంతో అతడు మరింత మెరుగయ్యాడని కేన్‌ పేర్కొన్నాడు. అండర్‌-19 స్థాయి నుంచి వీరిద్దరూ కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. 2008 యువ ప్రపంచకప్‌లో కోహ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా.. కివీస్‌ జట్టుకు విలియమ్సన్‌ సారథ్యం వహించాడు. ప్రస్తుత తరంలో గొప్ప బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు సాధించిన వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కేన్‌ మాట్లాడుతూ..

‘కేవలం సహజ సిద్ధ నైపుణ్యం వల్లే అతడు ఈ స్థాయికి రాలేదు. పరుగులు సాధించాలి, రోజురోజుకూ మెరుగవ్వాలనే అతడి పట్టుదలకు నైపుణ్యం తోడవడంతో ఫలితాలు వాటంతటవే వచ్చాయి. అందుకే కోహ్లీ ధాటికి రికార్డులు బ్రేక్‌ అవుతున్నాయి. పరిణతి వస్తున్నాకొద్ది అతడు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాడు’ అని అన్నాడు. న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగానూ వీరిద్దరూ పరస్పరం ప్రశంసలు కురిపించుకున్న విషయం తెలిసిందే.  


logo