శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 22, 2021 , 15:27:14

న‌ట్టూ.. నువ్వొక లెజెండ్‌: డేవిడ్ వార్న‌ర్‌

న‌ట్టూ.. నువ్వొక లెజెండ్‌: డేవిడ్ వార్న‌ర్‌

చెన్నై: ఐపీఎల్‌లో త‌న టీమ్ మేట్ అయిన టీమిండియా పేస్‌బౌల‌ర్ న‌ట‌రాజ‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా జ‌రిగిన వ‌న్డేలు, టీ20ల్లో న‌ట్టూ అద్భుతంగా రాణించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు త‌న తొలి టెస్ట్‌లోనే 3 వికెట్లు కూడా తీసుకున్నాడు. దీంతో నువ్వో లెజెండ్ న‌ట్టూ అంటూ వార్న‌ర్ ఆకాశానికెత్తాడు. వ‌జ్తుక‌ల్ (అభినంద‌న‌లు) న‌ట్టూ అంటూ త‌మిళంలో విష్ చేశాడు. ఫీల్డ్ లోపల, బ‌య‌ట కూడా నువ్వో గొప్ప వ్య‌క్తివి. నువ్వు మా టీమ్‌లో ఉండ‌టం నాకు చాలా ఆనందం క‌లిగిస్తోంది అని స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వార్న‌ర్ అన్నాడు. 

న‌ట్టూకి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించడం నా అదృష్టం. అత‌డో నిజ‌మైన జెంటిల్మ‌న్‌. మంచి టాలెంట్ ఉన్న వ్య‌క్తి. ఓ నెట్ బౌల‌ర్‌గా ఆస్ట్రేలియా టూర్‌కు వ‌చ్చాడు. త‌న భార్య ప్ర‌సవించినా వెన‌క్కి వెళ్ల‌లేదు. చివ‌రికి ఇదే టూర్‌లో అన్ని ఫార్మాట్ల‌లో అరంగేట్రం చేశాడు అని న‌ట‌రాజ‌న్‌పై వార్న‌ర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ అత‌డు అద్భుతంగా రాణించాల‌ని కోరుకుంటున్నా అని వార్న‌ర్ అన్నాడు. 

VIDEOS

logo