ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 03, 2020 , 00:09:01

ధ్యాన్‌చంద్‌ అవార్డుకు నారాయణ

ధ్యాన్‌చంద్‌ అవార్డుకు నారాయణ

కేసముద్రం టౌన్‌(మహబూబాబాద్‌): భారత వాలీబాల్‌ మాజీ కెప్టెన్‌ కన్నా వెంకటనారాయణ పేరును ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు జాతీయ వాలీబాల్‌ సమాఖ్య సిఫారసు చేసింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన వెంకటనారాయణ 1980, 90 దశకాల్లో భారత జట్టులో కీలకంగా వ్యవహరించారు. కన్నా మార్కయ్య, లక్ష్మి దంపతుల రెండో కుమారుడైన వెంకట నారాయణ.. కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో ఆడుతూ అంచలంచెలుగా ఎదిగారు. 1986లో భారత జట్టుకు ఎంపికైన ఈయన పదేండ్ల పాటు జట్టులో కొనసాగారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన నారాయణ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత యూత్‌ వాలీబాల్‌ కోచ్‌గా  రెండేండ్లు పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వం ఆర్టీసీలో స్పోర్ట్స్‌ అధికారిగా నియమించింది. 


logo