బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 27, 2020 , 00:19:35

నేటి నుంచి జాతీయ టీటీ టోర్నీ

నేటి నుంచి జాతీయ టీటీ టోర్నీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌నకు భాగ్యనగరం సిద్ధమైంది. సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ టోర్నీ జరుగనుంది. పురుషుల విభాగంలో 36, మహిళల విభాగంలో 33 జట్లు.. మొత్తంగా 1582 మంది ప్లేయర్లు టోర్నీలో తలపడనున్నారు. స్టార్‌ ప్లేయర్లు సాతియాన్‌, శరత్‌ కమల్‌ కూడా బరిలో ఉన్నారు. తెలంగాణ తరఫున స్నేహిత్‌, అలీ, శ్రీజ, వరుణి జైస్వాల్‌ సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు. జాతీయ చాంపియన్‌షిప్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ సంఘం అధ్యక్షుడు ఎ.నరసింహా రెడ్డి ఆదివారం తెలిపారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ప్రకాశ్‌ రాజ్‌ పాల్గొన్నారు.logo
>>>>>>