శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 30, 2020 , 00:23:11

చరిత్రలో తొలిసారి ఆన్‌లైన్‌లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం

చరిత్రలో తొలిసారి  ఆన్‌లైన్‌లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం

  • అవార్డులు అందజేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌..  
  • ఖేల్త్న్ర అందుకున్న రాణి, మనిక, తంగవేలు 

  న్యూఢిల్లీ:  జాతీయ క్రీడా పురస్కారాల ప్రదాన కార్యక్రమం మునుపెన్నడూ లేని విధంగా జరిగింది. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల క్రీడా హీరోలు తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా అవార్డులు అందుకున్నారు. హాకీ దిగ్గజం, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి అయిన శనివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్రీడా పురస్కారాలు ప్రదానం చేశారు. ఐదుగురికి రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర, 27 మందికి అర్జున సహా ఈ ఏడాది మొత్తం 74మంది క్రీడా పురస్కారాలు గెలువగా.. హైదరాబాద్‌, బెంగళూరు సహా మొత్తం 11 సాయ్‌ కేంద్రాల నుంచి 60మంది వర్చువల్‌ కార్యక్రమం ద్వారా అవార్డులు అందుకున్నారు.  రోహిత్‌ శర్మ(ఖేల్త్న్ర), ఇషాంత్‌ శర్మ(అర్జున) ఐపీఎల్‌ కోసం యూఏఈలో ఉండడంతో హాజరుకాలేకపోయారు. మరోవైపు రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌(ఖేల్త్న్ర), తెలుగు షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ (అర్జున) కరోనా సోకడంతో అవార్డుల కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. టీటీ స్టార్‌ ప్లేయర్‌ మనికా బాత్రా, పారాలింపిక్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌ ఖేల్త్న్ర పురస్కారాలు అందుకున్నారు.   స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌, మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ, గోల్ఫర్‌ అదితి అశోక్‌, హాకీ జట్టు స్ట్రైకర్‌ అక్షదీప్‌ సింగ్‌ అర్జున అవార్డు అందుకున్న వారిలో ప్రముఖులు. ద్రోణాచార్య జీవన సాఫల్య పురస్కారం ఎనిమిది మందికి, ద్రోణాచార్య అవార్డు ఐదుగురికి దక్కింది. కాగా ద్రోణాచార్య అవార్డు(జీవన సాఫల్య) గెలిచిన అథ్లెటిక్స్‌ కోచ్‌ పురుషోత్తమ్‌ రాయ్‌  గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమైన విషయంగా మారింది.   


నగదు ప్రోత్సాహకం పెంపు 

జాతీయ క్రీడా అవార్డు గ్రహీతల నగదు ప్రోత్సహకాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ పెంచింది. ఖేల్త్న్ర అవార్డుకు దాదాపు మూడు రెట్లు అధికం చేసింది.logo