బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Jul 31, 2020 , 00:30:47

జాతీయ క్రీడా అవార్డులు వాయిదా!

జాతీయ క్రీడా అవార్డులు వాయిదా!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఈసారి జాతీయ క్రీడా అవార్డులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే దేశంలో రోజురోజుకు వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న వేళ అవార్డులు నెల లేదా రెండు నెలల పాటు వాయిదా పడే చాన్స్‌ కనిపిస్తున్నది. అవార్డుల కార్యక్రమంపై రాష్ట్రపతి భవన్‌ మార్గదర్శకాల కోసం వేచిచూస్తున్నామని కేంద్ర క్రీడాశాఖ అధికారి ఒకరు గురువారం పేర్కొన్నారు. 


logo