శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 22:09:00

ఆల‌స్యం కానున్న జాతీయ క్రీడా అవార్డుల ప్ర‌దానోత్స‌వం

ఆల‌స్యం కానున్న జాతీయ క్రీడా అవార్డుల ప్ర‌దానోత్స‌వం

ఢిల్లీ : జాతీయ క్రీడా అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఈసారి ఆల‌స్యం కావొచ్చ‌ని క్రీడా మంత్రిత్వ‌శాఖ అధికారి ఒక‌రు గురువారం తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమం ఒకటి లేదా రెండు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంద‌న్నారు. అయితే రాష్ట్రపతి భవన్ నుండి వ‌చ్చే సూచ‌న‌ల త‌ర్వాతే ఈ అంశంపై తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలిపారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్, ఇత‌ర జాతీయ క్రీడా పుర‌స్క‌రాల‌ను ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. హాకీ లెజెండ్‌, మేజ‌ర్ థాన్ చంద్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ వేడుక‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

కానీ ఈ సంవత్సరం మహమ్మారి కారణంగా ఆలస్యం కావచ్చొన్నారు. క‌రోనా మహమ్మారి కార‌ణంగా అవార్డుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి గడువును పొడిగించారు. సెల్ఫ్ నామినేషన్ ఫలితంగా అవార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వ‌చ్చాయి. దరఖాస్తుల స్క్రీనింగ్‌ను క్రీడా మంత్రిత్వశాఖ ఇంకా ప్రారంభించలేదు. దీంతో ఆలస్యం అనివార్యం అని తెలుస్తోంది. ఈ సంవత్సరం క్రీడా అవార్డులు అంద‌జేయ‌డం ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే దరఖాస్తుల స్క్రీనింగ్ చాలా శ్రమతో కూడుకున్న పని అని మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. అయితే అవార్డులు మాత్రం త‌ప్ప‌కుండా అంద‌జేయ‌ప‌డ‌తాయ‌న్నారు. అర్హులైన అథ్లెట్లు, కోచ్‌ల గుర్తింపును తిరస్కరించే ప్ర‌శ్నే లేద‌న్నారు.


logo