గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 20, 2020 , 00:09:46

జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలు షురూ

జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలు షురూ
  • ప్రారంభించిన జగన్‌మోహన్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: కాన్పూర్‌(ఉత్తర్‌ప్రదేశ్‌) వేదికగా బుధవారం జాతీయ సీనియర్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు జగన్‌మోహన్‌ రావు పోటీలను ప్రారంభించారు. టోర్నీలో తెలంగాణతో సహా మొత్తం 34 జట్లు బరిలోకి దిగుతున్నాయి. 750 మంది క్రీడాకారులతో పాటు 50 మంది సాంకేతిక సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌ రావు మాట్లాడుతూ టోర్నీలో ప్రతిభ ఆధారంగా 150 మందిని ఎంపిక చేసి వారిని బిడ్డింగ్‌లో ప్రవేశ పెడుతామని ఆరు జట్లు వీరిని ఎంచుకుంటాయని తెలిపారు. 


ఈనెల 24న బిడ్డింగ్‌ ప్రక్రియ జరుగుతుందని ఆ తర్వాత ఫ్రొఫెషనల్‌ కోచ్‌ల సమక్షంలో వచ్చే నెల 4 వరకు బ్యూట్‌ క్యాంప్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.  ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌  (పీహెచ్‌ఎల్‌) తొలి సీజన్‌ మార్చి 5న ప్రారంభమవుతుందని జగన్‌మోహన్‌ రావు మీడియాకు వివరించారు. 


logo