మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 19, 2021 , 02:38:32

ఖమ్మంలో జాతీయ నెట్‌బాల్‌ టోర్నీ

ఖమ్మంలో జాతీయ నెట్‌బాల్‌ టోర్నీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: జాతీయ జూనియర్‌ నెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీకి ఖమ్మం ఆతిథ్యమివ్వనుంది. సర్దార్‌పటేల్‌ స్టేడియం వేదికగా ఈనెల 24 నుంచి 27 వరకు టోర్నీ జరుగనుంది. దేశంలోని గుర్తింపు పొందిన వివిధ రాష్ర్టాల జట్లు బరిలోకి దిగుతాయని జాతీయ నెట్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ ఖాజాఖాన్‌ పేర్కొన్నాడు. టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు రాష్ట్ర నెట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. 


VIDEOS

logo