మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Feb 23, 2020 , 00:20:00

కరీంనగర్‌లో జాతీయస్థాయి కరాటే పోటీలు ప్రారంభం

కరీంనగర్‌లో జాతీయస్థాయి కరాటే పోటీలు ప్రారంభం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో 5వ జాతీయస్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ ‘చీఫ్‌ మినిస్టర్‌ కప్‌-2020’ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నగర మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ స్వరూపరాణి ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. కాంటినెంటల్‌ షోటోకాన్‌ కరాటే డో ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో 22 రాష్ర్టాలకు చెందిన సుమారు 1400 మంది క్రీడాకారులు, 100 మంది అధికారులు పాల్గొంటున్నారు. సీనియర్స్‌, జూనియర్స్‌, కేడెట్స్‌, సబ్‌ జూనియర్స్‌ కేటగిరీలలో బాల బాలికలకు కాటా, కుమిటీ విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ఓపెన్‌ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ క్రీడాకారులకు రూ.3 లక్షల వరకు నగదును బహుమతిగా అం దజేయనున్నారు. పోటీల ప్రారంభోత్సవంలో నిర్వాహకులు శ్రీనివాస్‌, హరిశంకర్‌, ప్రవీణ్‌కుమార్‌, ప్రసన్నకృష్ణ, కోచ్‌లు పాల్గొన్నారు.


logo