శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 22, 2020 , 00:03:22

జాతీయ బాస్కెట్‌బాల్‌ శిక్షణకు రాష్ట్ర ఆటగాళ్లు

జాతీయ బాస్కెట్‌బాల్‌ శిక్షణకు రాష్ట్ర ఆటగాళ్లు

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా ఈనెల 25 నుంచి మొదలయ్యే జాతీయ బాస్కెట్‌బాల్‌ కోచింగ్‌ క్యాంప్‌నకు రాష్ర్టానికి చెందిన కోట్ల గౌతమ్‌, చడా కార్తీక్‌, గోన ప్రతీక్‌ ఎంపికయ్యారు. ఫిబా అండర్‌-16 ఆసియా పురుషుల చాంపియన్‌షిప్‌ సన్నాహాల్లో భాగంగా బెంగళూరులో ప్రత్యేకంగా ఈ కోచింగ్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను ఎంపిక చేశారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ జాతీయ యూత్‌ సెంటర్‌లో జరిగే శిక్షణ శిబిరం కోసం ఎంపికైన ఆటగాళ్లు ఈనెల 25లోగా రిపోర్ట్‌ చేయాలని జాతీయ బాస్కెట్‌బాల్‌ సమాఖ్య(బీఎఫ్‌ఐ) జనరల్‌ సెక్రెటరీ చందర్‌ముఖి శర్మ పేర్కొన్నారు. నాలుగు ఫొటోలతో పాటు పాస్‌పోర్టుతో హాజరు కావాలని ఆయన సూచించారు. logo