మంగళవారం 02 జూన్ 2020
Sports - Mar 26, 2020 , 08:35:07

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వాయిదా

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వాయిదా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావంతో టోర్నీల వాయిదా పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడగా..తాజాగా మరో టోర్నీ ఈ జాబితాలో చేరింది. అంతకంతకు ప్రమాదకరంగా మారుతున్న  కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావంతో వచ్చే నెల 27 నుంచి మొదలుకావాల్సిన జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వాయిదా పడింది.

‘కరోనా వ్యాధి నిరోధాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. ఈ కారణంగా లక్నోలో వచ్చే నెలలో జరుగాల్సిన 84వ జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను వాయిదా వేస్తున్నాం. షెడ్యూల్‌ ప్రకారం టోర్నీ  జరుగకపోవడం నిరాశ కల్గిసున్నా..విశ్వమారి కరోనాను ఎదుర్కొనేందుకు ఇంతకుమించిన మార్గం మరోకటి లేదు. పరిస్థితి  అదుపులోకి వచ్చాక అందరం ఒకసారి సమావేశమై టోర్నీ ఎప్పుడు జరుపాలో నిర్ణయం తీసుకుంటాం’ అని భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బాయ్‌) జనరల్‌ సెక్రెటరీ అజయ్‌ సింఘానియా అన్నారు. 


logo