పాపం పుజారా..10 సార్లు అతని బౌలింగ్‌లోనే

క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా కొంత మంది బ్యాట్స్‌మెన్ తమకు తెలియకుండానే ప్రతీ సారి ఒకే బౌలర్‌కు వికెట్ సమర్పించుకుంటారు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ బౌలింగ్‌లో మొత్తంగా 14 సార్లు ఔటయ్యాడు. ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ పుజారా(43: 160 బంతుల్లో 2ఫోర్లు) అద్భుత పోరాటపటిమ కనబర్చాడు. గులాబీ టెస్టులో ఏకంగా రెండు సెషన్ల పాటు వికెట్ కాపాడుకుంటూ ఆతిథ్య బౌలర్లను ఎదుర్కొన్నాడు.
భారత ఇన్నింగ్స్ 50వ ఓవర్లో ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్‌లో పుజారా ఔటయ్యాడు. టెస్టుల్లో లైయన్ బౌలింగ్‌లో పుజారా ఔటవడం ఇది పదోసారి కావడం గమనార్హం. సుదీర్ఘ ఫార్మాట్లో పుజారా ఎక్కువసార్లు లైయన్ బౌలింగ్‌లోనే నిష్ర్కమించాడు. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్.. పుజారాను ఏడుసార్లు ఔట్ చేశాడు.
తాజావార్తలు
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి