బుధవారం 03 మార్చి 2021
Sports - Jan 31, 2021 , 17:25:07

గుండు కొట్టించుకున్న భారత పేసర్‌ నటరాజన్‌

గుండు కొట్టించుకున్న భారత పేసర్‌ నటరాజన్‌

చెన్నై: టీమ్‌ఇండియా లెఫ్టార్మ్‌ పేసర్‌ టీ నటరాజన్‌ పళని ఆలయాన్ని సందర్శించాడు.  ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో నటరాజన్‌ అనుకోకుండా భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేయడం, టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలన్న తన కల నెరవేరడంతో పాటు పర్యటనలో విజయవంతమైనందుకు  దేవుడికి తలనీలాలు సమర్పించాడు. అనంతరం ఆలయం ముందు దిగిన ఫోటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు.  

తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళం సమీపంలోని చిన్నప్పంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్‌ ఆస్ట్రేలియా నుంచి స్వగ్రామానికి చేరుకోగానే గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో నటరాజన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు నటరాజన్‌ను నెట్‌ బౌలర్‌గా ఎంపిక చేశారు. ఐతే సిరీస్‌ మధ్యలో భారత బౌలర్లు గాయపడటంతో నటరాజన్‌కు టీ20, వన్డే, టెస్టు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చింది.  జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించడంతో పాటు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రశంసలు అందుకున్నాడు. 

VIDEOS

logo