ఆదివారం 12 జూలై 2020
Sports - May 18, 2020 , 15:54:42

ఆయన టీమిండియా క్రికెట్‌ ముఖచిత్రం మార్చారు

ఆయన టీమిండియా క్రికెట్‌ ముఖచిత్రం మార్చారు

న్యూఢిల్లీ: సునీల్‌ గవాస్కర్ అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌, యువరాజ్‌సింగ్‌, హర్బజన్‌సింగ్‌తోపాటు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వరకు అందరూ టీమిండియా క్రికెట్‌ ముఖచిత్రాన్ని మార్చిన వారే అని  ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాజర్‌ హుస్సేన్‌ అభినందించారు. 2000 నుంచి 2005 వరకు గంగూలీ టీమిండియాకు నాయకత్వం వహించి దూకుడుగా ఆడటమే కాకుండా అద్భుత విజయాలను సొంతం  చేసుకొన్న యుగంగా గుర్తించబడిందన్నారు. టీమిండియా ప్లేయర్లు తాము క్రికెట్‌ ఆడే విధానం కారణంగా అనేక మంది భవిష్యత్‌ ఆటగాళ్లు భారత్‌కు అందివచ్చారని కొనియాడారు. గంగూలీ ఎడం చేతి వాటం ఆటలో దూకుడు పెంచిందని, గంగూలీ కన్నా ముందున్న జట్టు ఎంతో వినయపూర్వకమైనదని, మర్యాదగలదని ప్రశంసించారు. 

స్కై స్పోర్ట్స్‌తో పోడ్‌కాస్ట్‌లో నాజర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. గంగూలీ భారత క్రికెట్‌ను మార్చిన గొప్ప ఆటగాడన్నారు. ఆయన కారణంగా భారత క్రికెట్‌కు ఎనలేని పేరు ప్రతిష్ఠలు వచ్చాయని చెప్పారు. జట్టు సభ్యులను ఉద్రేకపూరితంగా మార్చడంలో గంగూలి సఫలీకృతుడయ్యారని తెలిపారు. 2002లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌లో మ్యాచ్‌ గెలువగానే చొక్కా విప్పి గాల్లో తిప్పడం  ఒక్క గంగూలీకే చెల్లుతుందన్నారు. 


logo