బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 11:21:40

స్పాట్ ఫిక్సింగ్‌.. పాక్ క్రికెట‌ర్‌కు 17 నెల‌ల జైలుశిక్ష‌

స్పాట్ ఫిక్సింగ్‌.. పాక్ క్రికెట‌ర్‌కు 17 నెల‌ల జైలుశిక్ష‌

హైద‌రాబాద్‌:  పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ న‌సీర్ జెంషెడ్‌కు 17 నెల‌ల జైలు శిక్ష ఖ‌రారైంది.  స్పాట్ ఫిక్సింగ్ కేసులో అత‌నికి ఈ శిక్ష‌ను విధించారు. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో జెంషెడ్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డాడు. జెంషెడ్‌తో పాటు బ్రిటీష్ జాతీయులు యూసెఫ్ అన్వ‌ర్‌, మొహ‌మ్మ‌ద్ ఇజాజ్‌ల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నేష‌న‌ల్ క్రైం ఏజెన్సీ ముందు.. త‌మ నేరాల‌ను ఈ ముగ్గురూ అంగీక‌రించారు.  పాక్ సూప‌ర్ లీగ్‌లో ప్లేయ‌ర్లు స‌రైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌కుండా ఉండేందుకు జెంషెడ్‌.. వారికి ముడుపులు ఇవ్వ‌చూపిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఫిక్సింగ్‌లో భాగంగా అన్వ‌ర్‌, ఇజాజ్‌లు ప్లేయ‌ర్ల‌కు ఆర్థిక సాయం చేసేవారు. ఈ కేసులో అన్వ‌ర్‌కు 40 నెల‌లు, ఇజాజ్‌కు 30 నెల‌ల శిక్ష ప‌డింది. 2018 ఆగ‌స్టులోనే పాక్ క్రికెట్ బోర్డు జెంషెడ్‌పై ప‌దేళ్ల నిషేధం విధించింది. ఓ అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్‌లో జెంషెడ్ ప్లాన్ బ‌య‌ట‌ప‌డింది. 


logo