మన భూమ్మీద సూర్యగ్రహణాన్ని చాలా సార్లు చూసుంటాం. కానీ అదే సూర్యగ్రహణం ఇతర గ్రహాలపై ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) దీనికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసింది. అంగారక గ్రహంపై సూర్యగ్రహణం ఏర్పడుతున్న వీడియోను విడుదల చేసింది.
అంగారకుడికి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఫోబోస్ అనేది ఒకటి. ఆ ఉపగ్రహం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతున్న వీడియోను నాసా షేర్ చేసింది. ‘‘అంగారక గ్రహం మీద ఫోబోస్ వల్ల ఏర్పడిన సూర్యగ్రహణాన్ని.. అదే గ్రహం మీద నుంచి అత్యంత ఎక్కువ జూమ్ చేసి, అత్యంత భారీ ఫ్రేమ్ రేట్‌తో తీసిన వీడియో ఇది’’ అని నాసా పేర్కొంది. అంగారక గ్రహం మీదకు పంపిన పర్జవరెన్స్ రోవర్ ఈ వైరల్ వీడియోను తీసినట్లు తెలుస్తోంది.