మంగళవారం 07 జూలై 2020
Sports - May 30, 2020 , 22:22:00

కొవిడ్‌-19 పరీక్షలు చేయాల్సిందే: బాత్రా

కొవిడ్‌-19 పరీక్షలు చేయాల్సిందే: బాత్రా

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఉద్యోగుల్లో ఇద్దరికి వైరస్‌ సోకడంతో.. దేశంలోని మిగిలిన క్రీడా సమాఖ్యలన్నీ తమ ఉద్యోగులకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలని భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నరిందర్‌ బాత్రా కోరారు. జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్‌ఎస్‌ఎఫ్‌), జాతీయ ఒలింపిక్‌ కమిటీలు (ఎన్‌వోసీ) తక్షణమే పరీక్షలు మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ‘క్రీడా రంగాలకు చెందిన కార్యాలయ సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించాల్సిందే. అప్పుడే అథ్లెట్లకు నమ్మకం కలుగుతుంది’ అని బాత్రా తెలిపారు. హాకీ ఇండియా కార్యాలయాన్ని 14 రోజుల పాటు మూసివేస్తున్నట్లు.. అత్యవసర సేవల విభాగంలో పనిచేసేవారు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సిందిగా హెచ్‌ఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 


logo