శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 04, 2020 , 23:57:37

అమరచింతవాసి అరుదైన ఘనత

అమరచింతవాసి అరుదైన ఘనత
  • సైకిల్‌ రైడ్‌లో సత్తాచాటిన నరేందర్‌రెడ్డి
  • 1236 కిలోమీటర్లు 88 గంటల్లో పూర్తి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: సైక్లింగ్‌లో వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన మారెడ్డి నరేందర్‌రెడ్డి అరుదైన ఘనత సాధించాడు. రాండ్‌డొనరస్‌ అడ్వెంచర్‌ ఎల్‌ఆర్‌ఎం రైడ్‌లో 88 గంటల్లోనే 1236 కిలోమీటర్లు పూర్తి చేసి సత్తాచాటాడు. బెంగళూరు నుంచి గోవాకు.. అక్కడి నుంచి మళ్లీ ప్రారంభ స్థానానికి చేరే ఈ రైడ్‌లో మొత్తం 50 మంది పాల్గొనగా 23మంది మాత్రమే పూర్తి చేయగలిగారు. తెలంగాణ నుంచి పాల్గొన్న ఏకైక రైడర్‌ నరేందర్‌ రెడ్డి క్లిష్టతరమైన ఘాట్‌ రోడ్లను, పర్వత ప్రాంతాలను అధిగమించి తక్కువ సమయంలోనే రైడ్‌ను పూర్తిచేశాడు. నాలుగు రోజుల పాటు నిద్రలేకుండా సంకల్పంతో విజయవంతంగా ముగించాడు. 1,236.27 కిలోమీటర్ల అల్ట్రా సైక్లింగ్‌ స్పోర్ట్‌ను పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందని, 1400 కిలోమీటర్ల రైడ్‌ పూర్తిచేయడమే తన తదుపరి లక్ష్యమని నరేందర్‌ రెడ్డి తెలిపాడు. 


logo