బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 18, 2021 , 11:05:39

సెరీనాకు నిరాశ‌.. ఫైన‌ల్లోకి ఒసాకా

సెరీనాకు నిరాశ‌.. ఫైన‌ల్లోకి ఒసాకా

మెల్‌బోర్న్‌: సెరీనా విలియ‌మ్స్‌కు మ‌ళ్లీ చుక్కెదురైంది.  ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ సెమీస్‌లో అమెరిక‌న్ స్టార్ ఓట‌మి పాలైంది.  జ‌పాన్‌కు చెందిన క్రీడాకారిణి న‌వోమి ఒసాకా చేతిలో సెరీనా పరాజ‌యం చెందింది.  దీంతో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై ఉన్న సెరీనా ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి.  ఇవాళ జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌లో ఒసాకా 6-3,6-4 స్కోర్‌తో సెరీనాను చిత్తు చేసి ఫైన‌ల్లోకి ప్ర‌వేశించింది.  మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ఒసాకా ఈ మ్యాచ్‌లో సెరీనాకు  ఎటువంటి ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఒసాకా వ‌రుస‌గా 20వ మ్యాచ్‌ను గెలుచుకున్న‌ది.  అయితే ఇప్ప‌టి వ‌ర‌కు  గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్లో ఒసాకా ఓట‌మి చ‌విచూడ‌లేదు.  శ‌నివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో జెన్నిఫ‌ర్ బ్రాడీ లేదా క‌రోలినా ముచోవ్‌తో పోటీప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

VIDEOS

logo