గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 04, 2020 , 17:41:23

యూఎస్ ఓపెన్ : సుమిత్ నాగ‌ల్ ఔట్‌

యూఎస్ ఓపెన్ : సుమిత్ నాగ‌ల్ ఔట్‌

హైద‌రాబాద్‌: యూఎస్ ఓపెన్ రెండ‌వ రౌండ్‌లో భార‌తీయ టెన్నిస్ ప్లేయ‌ర్ సుమిత్ నాగ‌ల్ ఓట‌మి పాల‌య్యాడు.  ఆస్ట్రియాకు చెందిన రెండ‌వ సీడ్‌ డామినిక్ థీమ్ చేతిలో నాగ‌ల్‌ 6-3, 6-3, 6-2 స్కోరుతో వ‌రుస సెట్ల‌లో ప‌రాజ‌యం పొందాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైన‌ల్‌కు వెళ్లిన డామినిక్ థీమ్‌.. ఈ మ్యాచ్‌కు ముందు సుమిత్ నాగ‌ల్ ఆట తీరు గురించి వీడియోల‌ను ప‌రిశీలించిన‌ట్లు చెప్పాడు. సుమిత్ నాగ‌ల్ ఫోర్‌హ్యాండ్ షాట్లు బాగా ఆడుతాడ‌ని థీమ్ మెచ్చుకున్నాడు. యూఎస్ ఓపెన్ సింగిల్స్‌లో భార‌త్ త‌ర‌పున ఆడిన ఆట‌గాళ్లు త‌క్కువే. కానీ నాగ‌ల్ ఆ ఆశ‌లు రేపినా.. థీమ్ థాటికి చేతులెల్తేశాడు. తొలి సెట్ అయిద‌వ గేమ్‌లో ఇద్ద‌రూ నువ్వా నేనా అన్న‌ట్లుగా చెల‌రేగారు. అప్పుడ‌ప్పుడు మెరుపు లాంటి షాట్ల‌తో నాగ‌ల్ ద‌డ పుట్టించినా.. టాప్ ప్లేయ‌ర్ ముందు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు.  

 


logo