గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 06, 2020 , 00:20:45

యూఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాలో నాగల్‌

యూఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాలో నాగల్‌

న్యూయార్క్‌: భారత యువ టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నాగల్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌డ్రాకు నేరుగా అర్హత సాధించాడు. కొవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు స్టార్‌ ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో ప్రపంచ 127వ ర్యాంకర్‌ నాగల్‌కు ఈ అవకాశం దక్కింది. గతేడాది యూఎస్‌ ఓపెన్‌లో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌పై ఓ సెట్‌ గెలిచిన నాగల్‌.. ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో సత్తాచాటుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘మెయిన్‌డ్రాకు నేరుగా ఎంపికవడం ఆనందంగా ఉంది. పరిస్థితులు గతేడాదిలా లేవు. చెక్‌ రిపబ్లిక్‌లో చాలెంజర్స్‌ ట్రోఫీ తర్వాత అమెరికా బయలుదేరుతా’ అని నాగల్‌ బుధవారం అన్నాడు. మరో ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ (132) మెయిన్‌డ్రాకు అర్హత సాధించలేకపోయాడు.


logo